Thursday 10 June 2021

శివోహం!!

శివోహం...
శివం అంటే జీవం...
శివం అంటే చైతన్యం...
శివం ఉంటేనే అది జీవం...శివం లేకపోతే ఆ జీవం శవం..
శివం జీవి నుంచి తప్పుకుంటే అది శవం అనబడుతుంది....అంటే జీవి యొక్క ఉనికికి కారణం శివం..

ఈ సృష్టి యొక్క సూక్ష్మ రూపం శివం....ఈ కనిపించే ఈ సృష్టికి మూలం కనిపించని శివం.

మరి మనకి కనిపించే ఈ సృష్టి  ప్రకృతీగా శిలలుగా, కొండలుగా...వృక్ష రాజ్యాంగా, కీటక రాజ్యాంగా, సరిసృపాలుగా, పక్షులుగా, జంతువులుగా చివరిగా మానవులుగా మనకి కనిపిస్తుంది.
మరి ఈ శివం యొక్క శక్తి ఈ సృష్టి లో ఎక్కడెక్కడ ఎంత శక్తి వంతంగా ఉంది....? తెలుసుకుందామా?

ప్రకృతి శిలలో ఉన్న శివం, చైతన్య రహితంగా చాలా శక్తి హీనంగా ఉంది. అంటే కనీసం తనంతట తాను కదలలేని స్థితిలో ఉంది.
     మొక్కలు వృక్షాలలో ఈ శివం యొక్క శక్తి వల్ల మొక్కలు తనంతట తాను కదలలేవు కాని, పెరగగల శక్తిగా ఉంది. ఈ శక్తి వల్ల మొక్కలు పువ్వులను పూయించ గలవు...పువ్వుల వల్ల కాయలు కాయగలవు...కాయల వల్ల గింజలను సృష్టించుకో గలవు. ఆ గింజల వల్ల మళ్ళి ఇంకొ కొత్త మొక్కల్ని సృష్టించుకో గల శక్తి మొక్కలలో ఉన్న శివ శక్తికి ఉంది...
        మరి కీటకాలు పురుగులలో ఈ శివం యొక్క శక్తి ఈ భూమి పై ఆ జీవి తిరగాడడానికి, తమ ఆహారం సంపాదించు కోవడానికి...మరియు తమ సంతానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది...
ఇక్కడ మొక్కలతో పోలిస్తే కీటకాలలో ఉన్న ఆ శివం యొక్క శక్తి ఎక్కువ...మొక్కలు పెరగ గలవు కాని కదల లేవు..
  ఇక సరిసృపాలు, పక్షులలోని శివశక్తి కీటకాలు పురుగుల కంటే ఎక్కువ... వీటిలో వున్న శివ శక్తి ఈ భూమి పై ఆ జీవి తిరగాడడానికి, తమ ఆహారం సంపాదించు కోవడానికి...మరియు తమ సంతానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది...ఇంచుమించు జంతువులలా గర్భంలో కాకుండా గుడ్లు పెట్టి తమ సంతానాన్ని పెంచుకునే శివశక్తి సరిసృపాలు, పక్షులకి ఉంది... అంతే కాకుండా సరిసృపాలు, పక్షులలోని నాడీమండల శక్తి, కీటకాల పురుగుల కంటే అభివృద్ది చెంది ఉంటుంది. స్పర్శ జ్ఞానశక్తి  పెయిన్,బాదను అనుభవించే శక్తి ఉంటుంది.
మరి జంతువులలో వున్న శివ శక్తి ఈ భూమి పై ఆ జీవి తిరగాడడానికి, తమ ఆహారం సంపాదించు కోవడానికి...మరియు తమ సంతానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది...మానవులలాగా జంతువులు  సంతానాన్ని పెంచుకోవడానికి గర్భందాలుస్తాయి...కాని మానవులలా రెండు కాళ్లపై నడవలేవు..వాటి వెన్నెముక అడ్డంగా భూమి సమాంతరంగా ఉంటుంది, ఆలోచించే శక్తి ఉండదు...
మరి మానవుడు... జంతువుల నుంచి మానవుడి ని వేరు చేస్తున్నది బుద్ది, ఆలోచన శక్తి, మేధా శక్తి..మరి అంటే అత్యంత ఎక్కువ శివ శక్తి ఉన్నది ఈ భూమి పై ఒక్క మానవుడి లొనే...అందుకే  అన్నీ జీవ రాశులతో పోలిస్తే మానవుడు ఈ భూమిని శాషింఛగలుగుతున్నాడు.
మరి ఇంత శక్తి వంతమైన మానవుడు ఏమి శక్తి లేని వాడిగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నాడు...దానికి కారణం మలిన మైన మనసు, అంటే మలినంగా ఆలోచించే మనసు....మరియు అరిషట్ వర్గాలతో మలినం అయిన మనసు...మరి ఈ మలిన మనసు ఎలా ఏర్పడింది..?కారణం మన చుట్టూ ఉన్న కలిషుతమైన సమాజం మరియు కలిషుతమైన రాక్షస భోజనం.....

మరి మానవుడిలో శివ శక్తి ప్రజ్వరిల్లి సర్వ శక్తి వంతుడుగా మారాలి అంటే శివుడి లాగ ఆంజనేయుడి లా ధ్యానం చేయ వలసిందే....సాత్వికమైన శాకాహారం తీసుకోవలసిందే..